మునిగిపోయిన మెదక్ జిల్లాలోని ధూప్‌సింగ్ తండా… పైకప్పు పైకి ఎక్కి ఆర్తనాదాలు

-

అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం అవుతోంది. దింతో హవేలీఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా వాసులు వరదలో చిక్కుకుంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బిల్డింగ్ పైకి ఎక్కారు తండా వాసులు. తమని రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు తండా ప్రజలు. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.

medak
Dhoop Singh Thanda in Medak district sub

కాగా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు భారీ వరద ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండు జిల్లాల్లో కుండపోత వాన పడుతోంది. దింతో వాగులు, వంకలు, చెరువులు భయంకరంగా పొంగిపొర్లుతున్నాయి. అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news