తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. బిక్నూర్ మండలం తలమడ్ల సెక్షన్ లో ట్రాక్ పైకి వరద నీరు భారీగా చేరడంతో పలు రైళ్లను దారి మళ్లించారు. అక్కన్నపేట – మెదక్ పరిధిలో ముంబై – లింగంపల్లి, ఓఖా – రామేశ్వరం, భగత్ కి కోటి – కాచిగూడ, నిజామాబాద్ – తిరుపతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. కాచిగూడ – మెదక్ ట్రైన్ ను పాక్షికంగా రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు.

కామారెడ్డి జిల్లాలో వరదలకు NH 44ని అధికారులు బ్లాక్ చేశారు. మరోవైపు తెలంగాణ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి వర్షం ఎక్కువగా కురవడంతో పలు ప్రాంతాలలో ఇల్లులు ధ్వంసం అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో ఊరు దాటడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలావరకు ఆస్తి నష్టం సంభవించింది.