Ganesh Chaturthi 2025 : వినాయక పూజలో ఉపయోగించే 21 పత్రాలు ఏవి..? వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

-

Ganesh Chaturthi 2025 :  వినాయక చవితినాడు వినాయకుడిని ఆరాధించి ఎలాంటి అడ్డంకులు కలగకుండా ఉండాలని పూజిస్తారు. ఈ పూజలో తప్పనిసరిగా 21 పత్రాలను ఉపయోగిస్తారు. వాటి గురించి, వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడే మనం చూద్దాం. మాచి పత్రం ఆయుర్వేదం ప్రకారం చర్మవ్యాధుల్ని నయం చేస్తుంది. తలనొప్పిని తొలగించి నరాలకు బలాన్ని అందిస్తుంది. అలాగే బిల్వపత్రాన్ని కూడా ఉపయోగిస్తాము. బిల్వపత్రం నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన శ్వాసకోశ సమస్యలు నయమవుతాయి. బృహతీ పత్రం పిత్త, కఫాలను తగ్గిస్తుంది. మలబద్ధకం, జ్వరం, చర్మ రోగాలను కూడా నయం చేస్తుంది.

దూర్వాయుగ్మము అంటే గరిక. ఇది మూత్ర సంబంధిత సమస్యల్ని నయం చేస్తుంది. చర్మ రోగాలని కూడా తగ్గిస్తుంది. ఉమ్మెత్త పువ్వులు ఉండే పత్రం దత్తూర పత్రం. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నయం చేస్తాయి. బదరీ పత్రం చర్మవ్యాధుల్ని నయం చేస్తుంది. తుర్యా పత్రం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. జలుబు దగ్గు వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది. తుర్యా అంటే తులసి. అపామార్గ పత్రం దగ్గుని తగ్గిస్తుంది. కరవీరి పత్రం అంటే గన్నేరు పత్రం. ఇది పుండ్లను తగ్గిస్తుంది.

చూత పత్రం అంటే మామిడి ఆకులు. నోటి దుర్వాసన, చిగుళ్ళు, దంత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దాడిమీ పత్రం అజీర్తి సమస్యలను నయం చేస్తుంది. విష్ణు క్రాంత పత్రం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. దేవదారు పత్రం శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మరువక పత్రం కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. దేవదారు పత్రం దంత క్షయాలను తగ్గిస్తుంది. జాజి పత్రం అజీర్తి నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. దంత సమస్యల్ని దూరం చేస్తుంది. గండకీ పత్రం పైత్యాన్ని తొలగిస్తుంది. అశ్వద్ధ పత్రం రక్తస్రావాన్ని అరికడతాయి. అర్చన పత్రం గుండె సమస్యలు లేకుండా చూస్తుంది. అర్క పత్రం శరీరంలో వేడిని తగ్గించి నరాల బలహీనత నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news