Medak: వాగులో కొట్టుకుపోయిన కారు…!

-

 

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని నక్క వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నక్క వాగు ఉప్పొంగుతోంది. వరద ప్రవాహం ఎక్కువ కావడంతో ఒక్కసారిగా రోడ్డు తెగిపోయింది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కారు నీటి ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక ఆ నీటిలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు.

వారిని కాపాడేందుకు అధికారులు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటివరకు ఆ నలుగురి ఆచూకీ లభించలేదు. మీరు మాత్రమే కాకుండా ఇప్పటికే చాలా ప్రాంతాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిన్నటి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో ఆనకట్టలు, వంతెనలు సైతం తెగిపోతున్నాయి. ప్రజలు నీటి ప్రవాహాన్ని చూసి భయాందోళనకు గురవుతున్నారు. వారి ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news