మహారాష్ట్రలో గత కొద్ది రోజుల నుంచి మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలలో భవనాలు సైతం నేలమట్టం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పాల్ఘర్ లో భారీ వర్షాల కారణంగా భవనం నేలమట్టం అయింది. దీంతో 14 మంది మృతి చెందారు. వాసాయ్ లోని కొంత భాగం నిన్ననే కూలిపోయింది. ఈ ఘటనలో 9 మందిని ప్రాణాలతో సహాయక సిబ్బంది కాపాడారు.

భారీ వర్షాల కారణంగా శిథిలమైన పాత భవనాలలో ప్రజలు నివసించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నారు. కాగా అన్ని ప్రాంతాలలో గత కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.