తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో కుండపోత వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి అల్లకల్లోలం చేసింది. పట్టణంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయి. భారీ వరద కారణంగా కాలనీలు నీటితో నిండిపోయాయి. ఎటు చూసినా పూర్తిగా నీటితో భవనాలు ఇల్లులు నిండిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. నిన్నటి నుంచి విద్యుత్ సరాఫరా పూర్తిగా నిలిచిపోయింది.

హౌసింగ్ బోర్డ్ కాలనీ, గోస్కే రాజయ్య కాలనీలో వరద ఉధృతికి రోడ్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి హైవే పూర్తిగా ధ్వంసం అయింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి జిల్లా వాసులు వారి ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. నీటిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి వారి ప్రాణాలను సురక్షితంగా కాపాడారు. జమలయమైన కామారెడ్డి జిల్లా.. డ్రోన్ విజువల్స్ కూడా వైరల్ గా మారాయి.
కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం.. డ్రోన్ విజువల్స్
నిన్న కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కామారెడ్డి జిల్లా https://t.co/dNiDFVoiTP pic.twitter.com/k5TsbftKyQ
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2025