తెలంగాణలోని పలు జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో భారీగా వరదలు రావడంతో జనాలు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అల్లాడిపోతున్నారు. ఇప్పటికే కామారెడ్డి లోని కొన్ని కాలనీలు నీటితో నిండిపోయాయి. జనాలు వరదలలో చిక్కుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఎంతగానో కష్టపడ్డారు.

భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను కాపాడుకోవడానికి అల్లాడిపోయారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారిని పోలీసు తన భుజాలపై ఎక్కించుకొని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో ఆ పోలీసును నెటిజెన్లు అభినందిస్తున్నారు. వరదలలో ప్రాణాలను కాపాడిన పోలీసులను జనాలు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. కాగా, మరో రెండు రోజులపాటు మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.