ఈరోజు నుంచి విశాఖపట్నంలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. “సేనతో సేనాని” ప్రారంభం కానుంది. కాగా మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. రేపు 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి వచ్చే క్రియాశీలక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఉంటుంది.

30వ తేదీన అల్లూరి సీతారామరాజు ప్రాంగణం (ఇందిరాగాంధీ స్టేడియం) నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. కాగా, మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ సమావేశాలలో బిజీగా ఉండనున్నారు. ఈ సమావేశాలలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి అభివృద్ధి పనులను చేయాలి అనే అంశాల పైన ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎప్పటిలానే తన పనులను తాను చేసుకుంటారు.