భారీ వర్షాలు.. సిరిసిల్లకు చేరిన కేటీఆర్

-

భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిరిసిల్ల నియోజకవర్గం చేరుకున్నారు కేటీఆర్. గంభీరావుపేట మండలం, మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని పరిశీలించారు కేటీఆర్.

KTR
KTR on ground Inspects flood situation and directs BRS cadre to ensure relief measures

అటు భారీ వర్షాల వల్ల వరదలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ తరుణంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫోన్ చేసారు KCR. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news