అస్సామీ నటి సునీత గోగోయ్ తన ఫిట్నెస్ జర్నీతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 45 రోజుల్లో 13 కిలోల బరువు తగ్గి ఆరోగ్యకరమైన ఫిట్నెస్ రహస్యాన్ని పంచుకుంది. బిగ్ బాస్ లో పాల్గొన్న ఈ నటి తన ఫిట్నెస్ రహస్యమైన ఘీ కాఫీ, సీక్రెట్ ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మరి ఆమె ఫిట్నెస్ జర్నీ గురించి ఇప్పుడు చూద్దాం..
సునీత గొగోయ్ అస్సామీ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన నటి. తన ఫిట్నెస్ జర్నీతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె 45 రోజుల్లో 13 కిలోల బరువు తగ్గడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమని నిరూపించింది. ఆమె విజయ రహస్యం ఘీ కాఫీ గురించి అభిమానులతో పంచుకుంది. ఈ కాఫీ తాగడం వలన ఆమె ఆకలి నియంత్రించి, జీవక్రియను మెరుగుపరిచింది. బ్లాక్ కాఫీలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి కలిపి తాగడం వల్ల కొవ్వు కరిగిపోయిందని ఆమె తెలిపింది.

తన ఆహారంలో పోషకాలు సమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది ఇంటి ఆహారాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ప్రోటీన్, ఫైబర్ వంటి ఆరోగ్యకరమైన వాటిపై దృష్టి పెట్టింది. తీవ్రమైన వ్యాయామాలకు బదులుగా యోగా, వాకింగ్, డాన్స్ వంటి సాధారణ ఎక్ససైజ్ లను ఎంచుకుంది. ఈ మార్పులు ఆమె శరీరంలో గొప్ప మార్పుని తెచ్చాయి. ఈ కాఫీ ఆమె శక్తిని పెంచడమే కాక అవసరమైన ఆకలిని తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరిచింది.
ఘీ-కాఫీ అంటే : ఈ కాఫీ ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. బ్లాక్ కాఫీలో కొంత ఆవు నెయ్యి కలిపి తీసుకుంటే అదే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అవుతుంది. ముఖ్యంగా ఆవు నెయ్యితో ఈ కాఫీ మరింత రుచిగా ఉంటుంది. మామూలుగా అందరం కాఫీ టీ తాగుతూ ఉంటాం అయితే మామూలుగా తాగే కాఫీ ఒకటి, రెండు కప్పులు కన్నా ఎక్కువ తాగలేము, అలా తాగితే అది అనారోగ్యానికి కారణమవుతుంది. అదే బరువు తగ్గాలనుకునేవారు ఈ ఘీ కాఫీ రోజులో ఒకసారి స్వీకరించడం వల్ల రోజంతా చురుగ్గా ఉండటంతో పాటు బరువు తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.
గమనిక:పైన సూచించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఏ విధంగాను ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. వీటిని పాటించే ముందు మీ వైద్యున్ని సంప్రదించండి.