తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో ఒక అద్భుత ఆలయం నిర్మాణంలో కలదు. తెలుగు భాషకు, తెలుగు అక్షరాలకు గౌరవనీస్తూ ఓ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్త తోటా సుబ్బారావు సంకల్పంతో నిర్మితమవుతున్న ఈ ఆలయం స్తంభాలపై ఓ అద్భుతమైన దేవతల రూపాలను చెక్కించారు. తెలుగు వర్ణమాలలో ఒక్క అక్షరానికి ప్రాముఖ్యతనిస్తూ అక్షరాల గౌరవాన్ని పెంచే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. మరి ఆలయం ఎక్కడ ఉంది? ఆలయం విశిష్టతలు తెలుసుకుందాం..
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న సరస్వతి ఘాట్ వద్ద ఓ అద్భుతమైన దేవాలయం రూపుదిద్దుకుంటుంది. ఈ ఆలయం పేరు జ్ఞాన సరస్వతి దేవాలయం. ఈ ఆలయంను అక్షర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు అక్షరాలకు మన సంస్కృతిలో ఉన్న పవిత్రతను ప్రాముఖ్యతను చాటిచెప్పే ఓ గొప్ప ప్రయత్నం. సంస్కృతం, తెలుగు భాషల్లోని ప్రతి అక్షరానికి ఒక దేవత మూర్తిని రూపొందించి ఆ అక్షరాన్ని ఆ మూర్తి చేతిలో ఉంచి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇది అక్షరాల పట్ల మనకు ఉన్న భక్తి, గౌరవాన్ని తెలియజేస్తుంది.

ఈ అక్షర దేవాలయంలో సంస్కృతంలోని 51 అక్షరాలకు తెలుగులోని 56 అక్షరాలకు ప్రత్యేకమైన దేవతామూర్తులను విగ్రహాలుగా మలుస్తున్నారు. ఈ ఆలయ నిర్మాతల ఉద్దేశం ప్రకారం ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన శక్తి రూపం ఉంటాయి. ఉదాహరణకు ఆ అనే అక్షరానికి ఆదిపరాశక్తి రూపాన్ని, ఓం అనే అక్షరానికి ఓంకారేశ్వరి రూపాన్ని ఇస్తున్నారు. ఈ విగ్రహాలను ఏకశిలారాలతో ఎంతో నైపుణ్యంగా చెక్కారు ఈ ఆలయం పూర్తయితే పిల్లలు, పెద్దలు అందరికీ మన భాషల గొప్పతనం అక్షరాల విలువ గురించి తెలియజేసే ఒక అద్భుతమైన కేంద్రంగా ఈ ఆలయం మారుతుంది.
సరస్వతి ఘాట్ వద్ద నిర్మిస్తున్న ఈ ఆలయం విద్యా, జ్ఞానం, కలలకు ఆదిదేవతలైన సరస్వతి దేవికి నిలయంగా రూపొందింది. ఇప్పటికే సరస్వతి ఘాట్ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉన్న హనుమాన్, విష్ణు, ఆలయాలు పుష్కర మేళాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ ఆలయం పూర్తయితే రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత ప్రాచుర్యం పొందుతుంది.