ఏపీలో ఎన్టీఆర్ ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ బొమ్మతో వినాయక ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. ఎన్టీఆర్ బొమ్మతో వినాయక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో రచ్చ మొదలైంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారిపాలెంలో వినాయక చవితి ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఓ వర్గానికి చెందినవారు ఎన్టీఆర్ బొమ్మతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెట్టిన కొటేషన్తో ప్రారంభమైంది గొడవ.

ఆ ఫ్లెక్సీలో ‘కపాలాలు పగులుతాయి’ అంటూ పెట్టిన కొటేషన్ వల్ల కులాల మధ్య చిచ్చు రేగుతుందని తొలగించారు పెద్దలు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు వీరవాసరం పోలీసులు.
ఎన్టీఆర్ బొమ్మతో వినాయక ఫ్లెక్సీ.. కొటేషన్తో మొదలైన రచ్చ!
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారిపాలెంలో వినాయక చవితి ఉత్సవాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
ఓ వర్గానికి చెందినవారు ఎన్టీఆర్ బొమ్మతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెట్టిన కొటేషన్తో ప్రారంభమైన గొడవ
ఫ్లెక్సీలో… pic.twitter.com/vCbgV68vRW
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2025