కడుపులో నులి పురుగుల నివారణకు వంటింటి చిట్కాలు….!

-

మారుతున్న కాల పరిస్థితుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ గ్యాస్, కడుపు ఉబ్బరంగా లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు, కలుషిత నీరు. వీటి కారణం గా మన జీర్ణ వ్యవస్థలో చిన్న చిన్న పురుగులు ఏర్పడతాయి. కడుపులో పురుగులు ఉంటే చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇవి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తాయి.

తద్వారా పోషకాహార లోపం కలుగుతుంది.కాబట్టి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పేగులోని పురుగుల సంకేతాలు మరియు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకలి లేకపోవడం, విరేచనాలు,బరువు తగ్గడం, దగ్గు, అలసట వంటివి కనపడతాయి. అందుకు కొన్ని వంటింటి చిట్కాలు చూద్దాం. ఒక గ్లాస్ వెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ పచ్చి బొప్పాయి గుజ్జు మరియు ఒక టీ స్పూన్ తేనె కలిపి ఒక వారం పాటు ఉదయం పరగడుపున తాగాలి.

ఇంకా ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ పసుపు పొడి కలిపి రోజూ తాగితే పురుగుల్ని తొలగిస్తుంది.వెల్లుల్లి లో ఉండే యాంటీ బాక్టీరియల్ కడుపు నుండి పురుగుల్ని బహిష్కరించడం లో ఉపయోగ పడతాయి.వాము ఇది కూడా కడుపు ఉబ్బరానికి మంచి ఔషధం. వాము అర టీ స్పూన్ నోటిలో వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. ఇలా రెండు వారాలు చేస్తే పేగుల్లో పురుగులు పూర్తిగా పోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news