BRS కార్యకర్తను బ్రతికించిన నిరంజన్ రెడ్డి పచ్చబొట్టు

-

అంత్యక్రియల దాక వెళ్లిన కార్యకర్తను బ్రతికించింది బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పచ్చబొట్టు. వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో ఈ ఘటన జరిగింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పై అభిమానంతో ఛాతీపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు తైలం రమేశ్ (49) అనే వ్యక్తి. అయితే వనపర్తి పీర్లగుట్టలోని బంధువుల ఇంటికి వచ్చి అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన రమేశ్ ను చూసి… చనిపోయాడు అని అందరు అనుకున్నారు.

Former BRS Minister Singireddy Niranjan Reddy's tattoo brought the activist back to life
Former BRS Minister Singireddy Niranjan Reddy’s tattoo brought the activist back to life

దింతో అంత్యక్రియలకు సైతం ఏర్పాట్లు చేసిన కుటుంబసభ్యులు. ఇక ఈ విషయం తెలిసి తన అభిమాన కార్యకర్త చివరిచూపు కోసం వెళ్లారు బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ క్రమంలో రమేశ్ ఛాతిపై ఉన్న తన పచ్చబొట్టును చూస్తుండగా ఊపిరి పీల్చుకుంటున్నట్లు అనుమానం వచ్చి వెంటనే రమేశ్ పై ఉన్న పూలమాలలు తీయించారు నిరంజన్ రెడ్డి. అనంతరం పేరు పెట్టి పిలవగా కొద్దిగా కనురెప్పలు కదిలించడంతో ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. ఇక గంట తర్వాత కళ్లు తెరవడంతో ఆనందాశ్చర్యాలకు గురయ్యారు కుటుంబసభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news