నిజామాబాద్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. జక్రాన్ పల్లి మండలం పడకల్ జాతీయ రహదారి 44 దాటుతున్న చిరుతను ఢీకొట్టింది గుర్తుతెలియని వాహనం. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి సంఘటనపై ఇంకా వివరాలు తెలియలిస్ ఉంది.
https://twitter.com/TeluguScribe/status/1962734772909940786