యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ప్యూరిన్స్ అనే రసాయనాలు విచ్చిన్నమైనప్పుడు ఏర్పడే ఒక సహజ ఉత్పత్తి. ఇది మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది కానీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది కీళ్లలోని స్పటికాలను రూపంలో పేరుకుపోతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు వాపులు, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. ఆహార అలవాట్లు ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా ప్యూరిన్స్ అధికంగా ఉండే ఆహారాలు దూరంగా ఉండాలి. అయితే అసలు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి అనే వివరం తెలుసుకుందాం..
తీసుకోకూడని ఆహారాలు: యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం తగ్గించాలి. ముఖ్యంగా రెడ్ మీట్, అవయవ మాంసం వంటి వాటిలో ప్యూరిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే యూరిక్ యాసిడ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. వీటికి బదులుగా చికెన్, చేపలు తీసుకోవచ్చు. ఇంకా సీ ఫుడ్స్, పీతలు, రొయ్యలు వంటి ఫుడ్స్ లో కూడా ప్యూరిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలని పెంచుతాయి కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలి.
ముఖ్యంగా బీరు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు చాలా వేగంగా పెరుగుతాయి. బీర్ లో ప్యూరీస్ అధికంగా ఉంటాయి. ఇతర ఆల్కహాల్‌తో పోలిస్తే బీరు మరింత ప్రమాదకరం. సోడా పండ్ల రసాలు వంటి చెక్కర పానీయాలు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. వీటిలో ప్రక్టోజ్ అనే చక్కెర ఉంటుంది ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.

తీసుకోవాల్సిన ఆహారాలు: పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చెర్రీ పండ్లలో ఉండే గుణాలు యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తాయి. రోజుకు 8 నుంచి 10 గ్లాసులు నీరు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు తీసుకోవడం యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించాలంటే ఆహారపు అలవాటులో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే రెడ్ మీట్, అవయవ మాంసం, సి ఫుడ్స్, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. బదులుగా పండ్లు, కూరగాయలు తక్కువ కొవ్వు వున్నా పాల ఉత్పత్తులు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం ద్వారా కూడా యూరిక్ యాసిడ్ తగ్గించవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే, మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే తప్పకుండా వైద్య నిపుణుని సంప్రదించండి.