జనసేన అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాదిమంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. నిండు నూరేళ్లు జీవించాలని.. ఆయనకు దేవుడు ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు.

మంచి పాలనతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అటు అల్లు అర్జున్ కూడా…డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విషెష్ చెప్పారు. మా పవర్ స్టార్… డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు.
దీర్ఘాయుష్మాన్ భవ అంటూ… పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిరు ట్వీట్ చేసారు. చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం అని కొనియాడారు.