హైదరాబాద్ మహా నగరానికి చెందిన ఇద్దరు యువకులు యూకేలో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లారు. కాగా యూకేలో వినాయక నిమజ్జనం ఇటీవల జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. లండన్ లో వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో నాదర్ గుల్ కు చెందిన చైతన్య (22), ఉప్పల్ కు చెందిన రిషితేజ (21) అక్కడికక్కడే వారి ప్రాణాలను కోల్పోయారు.

మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మిగిలినవారు ఆసపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఇదిలా ఉండగా…. తెలుగు రాష్ట్రాలలో శనివారం రోజున వినాయక నిమజ్జనం జరగనుంది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం లోపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని జిహెచ్ఎంసి అధికారులు పేర్కొన్నారు.