తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించబోతున్నారని సమాచారం అందుతోంది. సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్ లతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు పూజలో పాల్గొననున్నారు కేసీఆర్.

ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రులలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అందులో భాగంగానే….ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించబోతున్నారని సమాచారం అందుతోంది. ఐదు రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్.
కాగా, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు రేపు లండన్ నుంచి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. లండన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి అధినేత కేసిఆర్ తో బేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తో చర్చించిన అనంతరం కవిత చేసిన పలు ఆరోపణలపై హరీష్ రావు స్పందించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కవిత రేపు మేధావులతో మీటింగ్ జరిపించడానికి సిద్ధమయ్యారు.