నాకు 2 సార్లు కాదు… మూడోసారి సీఎం కావాలని ఉంది – రేవంత్ రెడ్డి

-

నాకు రెండోసారి, మూడోసారి సీఎం కావాలని ఉందని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నేడు గురుపూజోత్సవం సందర్భంగా శిల్పకళా వేదిక టీచర్ల మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్లదే కీలక పాత్ర అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ గతంలో రెండోసారి సీఎం కావడానికి గల ప్రధాన కారణం విద్య వ్యవస్థలో తీసుకువచ్చిన సమూల మార్పులేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy's visit to Bendalapadu, Bhadradri district today
CM Revanth Reddy comments on his cm post

దానిని ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించారు. మీరు కూడా మంచిగా పనులను చేస్తే నేను రెండోసారి, మూడోసారి సీఎం అవుతాను. మళ్లీ సీఎం అవ్వాలని కొద్దిగా స్వార్థం ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చాలా చోట్ల కేజీ టు పీజీ ఉచిత విద్య అందడం లేదని అన్నారు. ఉపాధ్యాయులందరితో కలిసి కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news