తురకపాలెంలో 20 మంది మృతి… ప్రజలు వంట చేసుకోవద్దని సీఎం చంద్ర‌బాబు ఆదేశాలు

-

తురకపాలెంలో 20 మంది మృతి చెందిన నేప‌థ్యంలో… ప్రజలు వంట చేసుకోవద్దని సీఎం చంద్ర‌బాబు ఆదేశాలు ఇచ్చారు.  గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు సంభవించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా వంట చేసుకోవద్దని ఈ సందర్భంగా కోరారు. అక్కడి ప్రజలకు అధికారుల ఆహారం సరఫరా చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు.

cm chandrababu
20 people died in Turakapalem… CM Chandrababu Naidu orders people not to cook

దీంతో నేటి నుంచి తురకపాలెం గ్రామస్తులకు మూడు పూటల ఆహారం అలాగే మంచినీళ్లు.. ఇతర వస్తువులు సరఫరా చేయబోతోంది ఏపీ కూటమి ప్రభుత్వం. మరోవైపు తురకపాలెం లో.. మరణాలపైన ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది. దీనికి గల కారణాలను అన్వేషిస్తుంది. ఇది ఇలా ఉండ‌గా…గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో గత రెండు నెలల్లో సుమారు 20మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news