కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకుంది జూనియర్ అసిస్టెంట్ కల్పన. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాధవరెడ్డి అండదండలు చూసుకుని వేధింపులు, అక్రమ పనులు చేస్తున్నారని అంటున్నారు కల్పన బంధువులు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా లకావత్ కల్పన విధులు నిర్వహిస్తున్నారు.

కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అక్కడే ఉన్నవారు ఆసుపత్రికి తరలించారు. తన సూసైడ్ కు కారణం చరణ్ సింగ్, మాజీ ఎంపీటీసీ మేడిపల్లి మాలోత్ మోహన్, పై అధికారులే కారణమని సూసైడ్ లెటర్ కూడా రాసింది. మాలోతు చరణ్ సింగ్ మానసికంగా, లైంగికంగా వేధించాడని ఆరోపించింది కల్పన. మాలోత్ చరణ్ సింగ్, మాజీ ఎంపీటీసీ మాలోతు మోహన్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసిన జూనియర్ అసిస్టెంట్ కల్పన
కాంగ్రెస్ ఎమ్మెల్యే మాధవరెడ్డి అండదండలు చూసుకుని వేధింపులు, అక్రమ పనులు చేస్తున్నారని అంటున్న కల్పన బందువులు… pic.twitter.com/uSCRv3SK7S
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2025