కూకట్‌పల్లిలో మహిళను కాళ్లు, చేతులు కట్టేసి దారుణ హత్య

-

కూకట్‌పల్లిలో మహిళను కాళ్లు, చేతులు కట్టేసి దారుణ హత్య చోటు చేసుకుంది. స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో నివసించే రేణు అగర్వాల్(50)ను దారుణంగా హత్య చేశారు దుండగులు. కాళ్లు, చేతులు కట్టేసి.. ప్రేజర్ కుక్కర్‌తో తలపై బాది, కత్తులతో పొడిచి హత్య చేశారు.

Woman brutally murdered with her hands and feet tied in Kukatpally
Woman brutally murdered with her hands and feet tied in Kukatpally

ఇంట్లో పని చేసే ఇద్దరు బీహార్ యువకులే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య చేసి నగలు, డబ్బుతో పరారైనట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌, మొబైల్ టవర్ లొకేషన్‌ల ఆధారంగా నిందితులను వెంబడిస్తున్నారని సమాచారం.

https://twitter.com/TeluguScribe/status/1965943877631963296

Read more RELATED
Recommended to you

Latest news