కేసీఆర్ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆస్తుల్లో టాప్ నిలిచింది. 2023-24 FYలో దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలు రూ. 2,532 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని ADR నివేదిక తెలియజేసింది. ఇందులో 83% విరాళాల ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో రూ. 685.51 కోట్లతో బీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో TMC రూ. 646.39 కోట్లు, BJD రూ. 297 కోట్లు, TDP రూ. 285 కోట్లు, YCP రూ. 191 కోట్లు ఉన్నాయి.

మొత్తం పార్టీల ఆదాయంలో ఈ 5 పార్టీల ఆదాయమే 83.17% ఉన్నట్లు పేర్కొంది. కాగా, 40 పార్టీల ఖర్చుల మొత్తం రూ. 1,320 కోట్లుగా ఉంది. ఇదిలా ఉండగా… 2023 అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రజలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు. దానికి తగినట్టుగానే గులాబీ పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగున నిలదీస్తున్నారు.