భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.

తమదైన రాజకీయ, సామాజిక అనుభవం కలిగిన రాధాకృష్ణన్, దేశ రెండో అగ్రస్థాయి పదవిని చేపట్టడం విశేషం. రాధాకృష్ణన్ దక్షిణ భారతదేశానికి చెందినవారు కావడం వల్ల, ఈ నియామకం దక్షిణ రాష్ట్రాల్లో కేంద్రానికి బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ప్రయత్నంలో ఈ ఎంపిక కీలకమని భావిస్తున్నారు. ఉప రాష్ట్రపతి భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి తరువాతి అత్యున్నత పదవిలో ఉంటారు. ఆయనే రాజ్యసభ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తారు.
President Droupadi Murmu administers the Oath of Office to Vice President-elect C.P. Radhakrishnan.
(Pic Source: DD) pic.twitter.com/jO964aMt3t
— ANI (@ANI) September 12, 2025