తెలంగాణ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నెల 23వ తేదీ నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. బతుకమ్మ అలాగే దసరా పండుగల నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఇందులో భాగంగానే ఈ నెల 23వ తేదీ నుంచి ఒక చీర పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పటికే 50 లక్షల చీరలు తయారీ అయ్యాయి. మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్ లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి దాదాపు 800 రూపాయలు ఖర్చు అయినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెసిఆర్ కాలంనాటి కంటే… ఇప్పుడు భిన్నంగా చీరలు ఉంటాయని అంటున్నారు.