కాంగో నదిలో పెను ప్రమాదం జరిగింది. రెండు పడవ ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో.. 193 మంది మృతి చెందారు. లుకోలెలా వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తూ.. మంటల్లో చిక్కుకుని బోల్తా పడవ పడింది. ఈ ఘటనలో 209 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు అధికారులు.

మరోవైపు, ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో 86 మంది మృతి చెందారు. రెండు ఘటనల్లో కలిపి వందలాది మంది మరణించగా, మరికొంతమంది గల్లంతైన అవకాశముందని తెలుస్తోంది. ఇక ఈ సంఘటనల గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
- రెండు పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి!
- లుకోలెలా వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తూ.. మంటల్లో చిక్కుకుని బోల్తా పడిన పడవ
- ఈ ఘటనలో 209 మందిని రక్షించినట్లు పేర్కొన్న అధికారులు
- మరోవైపు, ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో 86 మంది మృతి