దక్షిణ భారతదేశం పశ్చిమ తీరంలో ఆభరణంలా మెరిసే ఉడిపి పట్టణం ఉంది. ఈ ప్రదేశాన్ని చాలామంది దేవాలయ భూమి అని, కొందరు పరిశ్రమ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడే భక్తుల మనసులను ఆకట్టుకునే, శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఉంది. సుమారు వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ ఆలయం, 13వ శతాబ్దంలో వైష్ణవ సంతుడు శ్రీమద్ఆనందతీర్థులు (మాధ్వాచార్యులు) స్థాపించారని స్థానికుల విశ్వాసం. ఉడిపి శ్రీకృష్ణ ఆలయానికి అనేక విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. భక్తిని మేల్కొలిపే ఆ అద్భుత రహస్యాల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటకలోని ఉడిపిలో వెలసిన శ్రీకృష్ణ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఎన్నో అద్భుతాలకు నిలయం వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన యాలయం భక్తులు నమ్మకాలతో ముడిపడి ఉంది ఈ దేవాలయం నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతలు ఇక్కడ జరిగే పూజలు ఉత్సవాలు దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలు చాలామందికి తెలియని విషయాలు వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి స్వామివారిని దర్శించుకునే విధానం, అక్కడి ప్రసాదం స్వీకరించే పద్ధతి, ఇది ఇతర దేవాలయాలకు భిన్నంగా ఉంటుంది మరి ఆ విశేషాలు మనము తెలుసుకుందాం..
సాధారణంగా ఏ గుడిలోనైనా స్వామివారిని నేరుగా దర్శించుకుంటారు. కానీ ఉడిపి కృష్ణ ఆలయంలో స్వామి వారిని ఒక చిన్న కిటికీ ద్వారా మాత్రమే దర్శించుకోవాలి. మొత్తం తొమ్మిది కిటికీలు ఆలయం చుట్టూ ఉంటాయి. వీటిల్లో నుంచి మాత్రమే భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. దీనికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

ఒకానొకప్పుడు కృష్ణ భక్తుడైన కనకదాసు అనే అతను ఆలయ ప్రవేశం కోసం చాలా ప్రయత్నించాడు కానీ అతడు నిమ్నాకులానికి చెందిన వాడు కావడంతో ఆలయ పూజారులు అతని లోపలికి అనుమతించలేదు. కనకదాసు నిరాశ చెంది ఆలయం వెనుక కూర్చొని తన భక్తితో కృష్ణ భజనలు చేయడం మొదలు పెట్టాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు అతన్ని కరుణించి అతనికి దర్శనం ఇచ్చాడు.అప్పుడు ఉన్నట్టుండి ఆలయం వెనుక గోడలో ఒక కిటికీని ఏర్పరిచారు ఆ కిటికీ ద్వారా స్వామి వారి విగ్రహం కనకదాసు వైపు తిరిగింది. అప్పట్నుంచి భక్తులు ఆ కిటికీ గుండానే శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకుంటున్నారు.
ఆలయ ప్రత్యేకతల్లో మరొకటి ఆలయంలో ప్రసాదం స్వీకరించే పద్ధతి. ఉడిపి శ్రీకృష్ణుని ఆలయానికి సంబంధించిన నమ్మకాల్లో ఈ ప్రసాదం స్వీకరించడం కూడా ఒక నమ్మకం ఈ గుడిలో భక్తులు స్వామివారి ప్రసాదాన్ని నేలపై వడ్డించమని అడుగుతారు. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని ప్రసాదాన్ని ఇలా స్వీకరించడం అక్కడి భక్తులు నమ్మకం. నేలపైనే వడ్డించుకొని ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరిస్తారు.
ఈ ఆలయం మధ్వ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రం. ఇక్కడ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిగా వెలిశాడు. ఒకప్పుడు రుక్మిణి దేవి శ్రీకృష్ణుని చిన్నతనంలో నీవు ఎలా ఉన్నావో నేను చూడలేదు. నీ చిన్నతనంలోని బాలకృష్ణుడి రూపాన్ని చూడాలని ఉంది అని అడగ్గా ఆమె కోరిక కోసం శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిగా ఈ ఉడిపిలో వెలిశాడని పండితులు చెబుతున్నారు.
ఈ క్షేత్రంలో ఆలయం మహిమ దాని వెనుక ఉన్న విశేషాలు మాటల్లో చెప్పలేనివి ఇవన్నీ అనుభవించాలంటే తప్పకుండా చేయాలి అని దర్శించాలి.