రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నువ్వు మగాడివి అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేపించు.. ఎన్నికల్లో చూసుకుందామని సవాల్ చేశారు. ఎవరి సత్తా ఏందో.. ఎవరి పని తీరు ఏందో ప్రజలు నిర్ణయిస్తారన్నారు కేటీఆర్.

రేవంత్ రెడ్డికి ఏమన్నా రేషం ఉందా.. మీరే కద ఆనాడు ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమన్నారని గుర్తు చేశారు. ఇవాళ రాళ్లతో ఎవరిని కొట్టాలి.. ఆ ఇంటి మీద వాలిన కాకులు ఈ ఇంటి మీద వాలకూడదు అన్నారు.. ఈ పదిమంది కాకులు ఎటు కాకుండా పోయారని ఆగ్రహించారు.
ఒకటి స్త్రీలింగం ఉంటుంది, ఒకటి పులింగం ఉంటుంది.. వీళ్ళు ఏ లింగాలు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యే లు రాజీనామాలు చేయక తప్పదు.. ఉప ఎన్నిక రాక తప్పదు…రాబోయే 6 నుండి 9 మాసాల్లో ఉప ఎన్నిక రాబోతుందని తెలిపారు కేటీఆర్.