తెలంగాణలోని పలు జిల్లాలలో మరో రెండు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. యాదాద్రి, అదిలాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. అదిలాబాద్, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హనుమకొండ, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఆసిఫాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షం అధికంగా కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో ఇప్పటికే పలు జిల్లాలలో ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం లాంటి మహానగరాలలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రెండు మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.