Mirai Movie: మిరాయ్‌ కోసం ప్రభాస్‌ రెమ్యునరేషన్‌?

-

తేజ సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం “మిరాయ్”. ఈ సినిమా రెండు రోజుల క్రితమే విడుదలై రికార్డులను తిరగరాస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 50 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా మంచు మనోజ్ విలన్ పాత్రను పోషించారు. విలన్ పాత్రలో మంచు మనోజ్ అద్భుతంగా నటించారు.

Mirai Movie, prabhas,
Mirai Movie, prabhas,

ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కూడా కీలకపాత్రను పోషించారు. అతను సినిమాలో కనిపించలేదు కానీ సినిమాకు వాయిస్ అందించారు. మిరాయ్ సినిమాలో వాయిస్ ఇచ్చినందుకు ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ బాగుంటుందని మేకర్స్ చెప్పగానే అతను వెంటనే ఓకే చేశాడట. వెంటనే సమయం చూసుకొని సినిమాకు వాయిస్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఈ విషయం తెలిసిన అనంతరం ప్రభాస్ అభిమానులు అతడిని పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news