కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వివాదంలోకి చిక్కుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడి వేధింపుల వల్లే చనిపోతున్నాను అంటూ ఓ యువకుడు సంచలన వీడియో రిలీజ్ చేశారు.
సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను నిలదీసినందుకు పోలీసులతో కొట్టించాడని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు యువకుడు.

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమాయత్‌నగర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతి పత్రం అందజేశారు గ్రామస్తులు. బస్సు గురించి ఎన్ని సార్లు అడిగినా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు బండారి శ్రీనివాస్ అనే యువకుడు.
దీంతో అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఎమ్మెల్యే అనుచరుడు ఆర్మీ శ్రీనివాస్. ఎమ్మెల్యే అనుచరుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తనను బూతులు తిడుతూ, అకారణంగా కొట్టాడని ఆరోపిస్తూ, కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు బాధితుడు. ఇక ఈ సంఘటన వైరల్ గా మారింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడి వేధింపుల వల్లే చనిపోతున్నాను
సోషల్ మీడియాలో ఎమ్మెల్యేను నిలదీసినందుకు పోలీసులతో కొట్టించాడని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమాయత్‌నగర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్… pic.twitter.com/TaDCBxTkmt
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2025