ఏపీలో భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను అరికట్టే విధంగా చర్యలను చేపట్టామని సత్యప్రసాద్ అన్నారు. నాలా చట్టాన్ని రద్దుచేసి పారిశ్రామికవేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని అన్నారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా… ఏపీలో మరోవైపు మెగా డీఎస్సీ ఫలితాలను ఈరోజు మంత్రి నారా లోకేష్ రిలీజ్ చేశారు. డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 22 నుంచి 29 వరకు వారికి కేటాయించిన జిల్లాలలో ట్రైనింగ్ ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. ఆ తేదీలలోనే కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి హోస్టింగ్ ఇస్తామని అన్నారు. ఏకంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయినట్లుగా నారా లోకేష్ అన్నారు. డీఎస్సీలో ఎంపికైన వారికి మంత్రి నారా లోకేష్ స్పెషల్ విషెస్ తెలిపారు.