నవంబర్ లో టెట్… ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

-

మెగా డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 22 నుంచి 29 వరకు వారికి కేటాయించిన జిల్లాల్లో ట్రైనింగ్ ఇస్తామంటూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. ఆ తేదీలలోనే వారికి కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామని అన్నారు. ఈ నోటిఫికేషన్ లో భర్తీ కానీ 406 పోస్టులను వచ్చే డీఎస్సీలో కలుపుతామని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని అన్నారు. ఈ నవంబర్ నెలలో డీఎస్సీ ఉంటుందని దానికి ప్రిపేర్ కావాలని కోన శశిధర్ సూచించారు.

tet
TET in November AP government’s key announcement

ఇదిలా ఉండగా… ఈరోజు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. వారు ఇచ్చిన మాటను అతి తక్కువ రోజులలోనే నిలబెట్టుకున్నామని అన్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయినట్లుగా చెప్పారు. 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ ని పూర్తి చేశామని అన్నారు. ఈనెల 19న అపాయింట్మెంట్ లెటర్లను ఇస్తామని అన్నారు. దసరా సెలవుల అనంతరం వారిని విధుల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం వెలువడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news