నమ్మశక్యం కాని నిజం.. అలారం శబ్దం గుండెను దెబ్బతీస్తుందట!

-

నిద్రలేవడానికి మనం రోజూ ఉపయోగించే అలారం శబ్దం మన గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలదని మీకు తెలుసా? ఇది ఆశ్చర్యంగా అనిపించినా, శాస్త్రీయంగా దీని వెనుక ఒక కారణం ఉంది. నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం విశ్రాంత స్థితిలో ఉంటుంది. అప్పుడు హఠాత్తుగా, బిగ్గరగా మోగే అలారం శబ్దం మన శరీరాన్ని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తుంది. దీనివల్ల రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరుగుతాయి. ఇలా నిరంతరం జరగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి గుండె జబ్బులకు కారణాలు,జాగర్తలు తెలుసుకుందాం..

గుండె జబ్బులకు ప్రధాన కారణాలు:ఈ రోజుల్లో గుండె జబ్బులు వయస్సుతో సంబంధం లేకుండా చాలామందికి వస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పని, ఆర్థిక వ్యక్తిగత ఒత్తిడి గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఒత్తిడి హార్మోన్లు (కార్టిసాల్) పెరిగి, రక్తపోటును పెంచుతాయి.ఇక బయట ఫుడ్స్ తినటం, వాటిలో నూనె, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇది గుండెకు ప్రమాదం.మరో కారణం వ్యాయామం లేకపోవటం శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరగడం, రక్తపోటు, షుగర్ లెవెల్స్ పెరిగి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పొగతాగడం, మద్యం సేవించడం కూడా ఓక కారణం పొగాకులో ఉండే నికోటిన్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది రక్తపోటును పెంచుతుంది. మద్యం కూడా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Unbelievable Truth: Alarm Sound Can Harm Your Heart!
Unbelievable Truth: Alarm Sound Can Harm Your Heart!

యువత తీసుకోవలసిన జాగ్రత్తలు: రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. అలాగే, బిగ్గరగా మోగే అలారానికి బదులుగా, క్రమంగా పెరుగుతున్న శబ్దాలు లేదా కాంతితో కూడిన అలారాలను ఉపయోగించడం మంచిది.ఇక రోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం, యోగా లేదా నడక వంటివి అలవాటు చేసుకోవాలి.అంతేకాక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ధ్యానం, యోగా సంగీతం వినడం, నచ్చిన హాబీలను అలవర్చుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించడం అలవర్చుకోవాలి.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. గుండె జబ్బులు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

Read more RELATED
Recommended to you

Latest news