కాంగ్రెస్ నేతలు యూరియా బుక్కుతున్నారు అని ఆగ్రహించారు కేటీఆర్. తెలంగాణలో ప్రస్తుతం యూరియా సమస్య ఏర్పడింది. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో రైతులు యూరియా కోసం షాపుల ముందు క్యూ కడుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూరియా తింటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గన్ మెన్ యూరియా లారీ తీసుకువెళ్లారని వార్తల్లో చూశాను అంటూ కేటీఆర్ తెలిపారు. ఒక గన్మెన్ లారీ తీసుకెళ్తే… ఎమ్మెల్యే గోదాం ఖాళీ చేసి ఉంటారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ విషయం తెలిసిన అనంతరం గన్ మెన్ పై జిల్లా ఎస్పీ శరత్ విచారణకు ఆదేశించారు.

తమకు ఇవ్వాల్సిన యూరియాను బ్లాక్ లో అమ్మడంపై రైతులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోవడంలేదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ను ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. బంగారం షాపులలో పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది. లా&ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఇప్పటికైనా ప్రజల కష్టాల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంటూ కేటీఆర్ సంచలన కామెంట్లు చేశారు. కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలపై కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.