తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచే ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్.. అసోసియేషన్ ప్రకటన చేసింది.

మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 323 ఆసుపత్రులు ఉన్నాయని… వాటన్నిటికీ 1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తాజాగా వెల్లడించింది హాస్పిటల్స్ అసోసియేషన్. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో….. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆ దిశగా అడుగులు వేసేందుకు సంసిద్ధం అయ్యాయి. మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ వరకు 100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు వెల్లడించాయి.