తక్కువ ధరకే భారీ బ్యాటరీతో పోకో కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ రిలీజ్ అయింది పోకో m7 + 5g 4gb లిమిటెడ్ ఎడిషన్ ను భారత మార్కెట్ లో రిలీజ్ చేశారు. 6.9 ఇంచుల ఎల్సిడి డిస్ప్లే, 50 మెగాపిక్సల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సల్ ముందు కెమెరా, 7000 ఎం ఏ హెచ్ బ్యాటరీ లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్ ను రూ. 12,999 ధరకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్కార్ట్ లో ప్రత్యేకంగా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

బ్యాంకు ఆఫర్లతో ఈ ఫోన్ ధర రూ. 10,999 కు తగ్గించుకోవచ్చు. కాగా నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేసి స్మార్ట్ ఫోన్లను మాత్రమే వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా వారికి అవసరమైన సమాచారాన్ని ఈజీగా తెలుసుకుంటున్నారు. దానికి తగినట్టుగానే మార్కెట్లలోకి అతి తక్కువ ధరకే ఫోన్లో లాంచ్ అవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు వాటిని కొనుగోలు చేస్తున్నారు.