మతమార్పిడుల నివారణకు దళితవాడలలో 1000 ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు పేర్కొన్నారు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆరు ఆలయాలు నిర్మిస్తామని అన్నారు. టీటీడీ ధర్మకర్తల సమావేశం నిర్ణయాలను ఆయన వెల్లడించారు ఈ నెల 24 నుంచి వచ్చే నెల రెండు వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు ఆ రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని చెప్పారు.

24న సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని బి.ఆర్ నాయుడు వెల్లడించారు. ఇదిలా ఉండగా తిరుమలలో ప్రస్తుతం భక్తులను విపరీతంగా పెరుగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి చాలా గంటల సమయం పడుతుంది మరోవైపు తిరుమల లో జల్లులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు.