తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. నిన్న అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు.. ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఈ ప్రవేట్ ఆసుపత్రిల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ప్రకటన కూడా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 323 ప్రవేట్ ఆసుపత్రులలో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తున్నట్లు ఆయన… వెల్లడించారు.

ఆగస్టు నుంచి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎంత కోరినా… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం… చేశారు. ప్రజలకు ఆరోగ్యం అందిస్తున్న ఆసుపత్రులు అనారోగ్యం బారిన పడుతున్నాయని ఆయన వాపోయారు. ఆరోగ్య తెలంగాణ కోసం తాము శాయశక్తుల ప్రయత్నిస్తున్నామని కూడా స్పష్టం చేశారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించాలని ఆయన గుర్తు చేశారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే మళ్లీ.. ప్రజలకు సేవ చేస్తామని ప్రకటించారు. అప్పటివరకు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని వెల్లడించారు.