తెలంగాణలో మూడో డిస్కం ఏర్పాటుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు ఇంధన శాఖ అధికారులు.
వ్యవసాయం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని ఇంధన శాఖ ప్రతిపాదనలు పంపింది.

ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంలను మూడు డిస్కంలుగా పునర్విభజన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. 3వ డిస్కంకు సంబంధించి PPA అలొకేషన్, సిబ్బంది విభజన, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై పలు కీలక సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్… కేబినెట్ ఆమోదం అనంతరం కొత్త డిస్కం ఏర్పాటుపై ముందుకెళ్లాలన్నారు. కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.