కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 నెలల నుంచి జీతాలు లేవు..కేసీఆర్ పాల‌నే బాగుంది – హైడ్రా సిబ్బంది

-

6 నెలల నుంచి జీతాలు లేవు..కేసీఆర్ పాల‌నే బాగుందని హైడ్రా సిబ్బంది వెల్ల‌డించింది. హైడ్రా కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. హైడ్రా కార్యాలయాన్ని ముట్టడించిన హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది.. అనంత‌రం మాట్లాడారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కడుపుల పెట్టుకొని చూసుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఆరు నెలల నుండి జీతాలు లేవని ఆగ్ర‌హించారు.

hydra
Hydra DRF personnel besiege Hydra office

జీతాలు పెంచే ప్రభుత్వాలను చూసాము కానీ మొదటి సారి జీవో తెచ్చి మరి జీతాలు తగ్గించిన ప్రభుత్వాన్ని చూస్తున్నామన్నారు. డబ్బులు సరిపోక రాత్రి వేళల్లో ర్యాపిడో, ఊబర్, జొమాటో లాంటివి చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామని వెల్ల‌డించారు. గత ప్రభుత్వంలో విశ్వజిత్ అనే ఐపీఎస్ సర్ గారు మా కష్టాలు చూసి జీతాలు పెంచారు.. అలాంటిది ఇప్పుడు హైడ్రా ఉన్న జీతాలు కూడా తగ్గించేసిందని ఆగ్ర‌హించారు.  గత ప్రభుత్వంలో 3 తారికు నాడు ఏది ఏమైనా మా జీతాలు మాకు వచ్చేవి.. కానీ ఇప్పటికీ జీతాలు తగ్గించి, టైంకి ఇవ్వక ఇబ్బంది పడుతున్నామని వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news