హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సికింద్రాబాద్, విద్యానగర్, అంబర్పేట్, మాదాపూర్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, నాంపల్లి, మల్లేపల్లి, రాజేంద్ర నగర్, అల్వాల్, బోయినపల్లి, బేగంపేట్, కాప్రా, మల్కాజ్ గిరి,

రాజేంద్రనగర్, చార్మినార్ లో భారీ వర్షం పడింది. దీంతో పలు చోట్ల భారీగా ట్రా ఫిక్ జామ్ కూడా అయింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. మియాపూర్‌లో 9.7, లింగంపల్లిలో 8.2, HCUలో 8.5, గచ్చిబౌలిలో 6.6, చందానగర్‌లో 6.4, హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. దీంతో రహదారులు చెరువులను తలపించాయి. ఇక ఇవాళ కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో కూడా వర్షం పడే ఛాన్సు ఉంది.