ఏపీ శాసనమండలిలో గందరగోళం…రెచ్చిపోయిన వైసీపీ స‌భ్యులు

-

ఏపీ శాసనమండలిలో గందరగోళం చోటు చేసుకుంది. ఇవాళ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయిన త‌రుణంలోనే…. యూరియా సమస్య తీర్చాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. రేపు బీఏసీ సమావేశంలో రైతుల సమస్యలపై చర్చిద్దామని తెలిపారు ఏపీ స్పీకర్ అయ్య‌న్న పాత్రుడు.

YCP members' slogans call for solving the urea problem and providing remunerative prices for crops
YCP members’ slogans call for solving the urea problem and providing remunerative prices for crops

యూరియా సహా అన్ని సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని సభలో తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇక అటు శాసనమండలిలో రైతుల సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం వేసింది. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధర, ఇతర రైతాంగ సమస్యలపై సభలో చర్చించాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేసారు. ఎమ్మెల్సీ లు తోట త్రిమూర్తులు, రామసుబ్బారెడ్డి, శివరామరెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news