మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతడు అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళితో సినిమా అనంతరం ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంపై అభిమానులలో ఆసక్తి నెలకొంటోంది. దీని కోసం మైత్రి మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాలని మహేష్ బాబును సునీల్ కోరినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కాల్షీట్ల ఆధారంగా ఈ సినిమా గురించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసిన అనంతరం మహేష్ బాబు అభిమానులు సందీప్ వంగా – మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వచ్చినట్లయితే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ విషయం పైన మహేష్ బాబు ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదు.