OTT లోకి వచ్చేసిన మహావతార్ నరసింహ… ఎందులో స్ట్రీమింగ్ అంటే

-

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యానిమేషన్ చిత్రం “మహావతార్ నరసింహ”. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ఫుల్ గా థియేటర్లలో 50 రోజులు నడిచింది. తాజాగా మహావతార్ నరసింహ సినిమా ఓటీటిటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. రేపు మధ్యాహ్నం 12:30 నుంచి తెలుగుతో సహా పలు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో మహావతార్ నరసింహ సినిమా స్ట్రీమింగ్ కానుంది. శ్రీమహావిష్ణువు దశావతారాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఏకంగా రూ. 340 కోట్లకు పైగానే కలెక్షన్లను రాబట్టింది.

Mahavatar Narasimha, Mahavatar Narasimha ott
Mahavatar Narasimha, Mahavatar Narasimha ott

కాగా, ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి షోతోనే ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఎంతగానో ఆసక్తిని చూపించారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తీసుకొని విధంగా మహావతార్ నరసింహ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news