అన్నదమ్ముల మధ్య గొడవలు తలలు పగలగొట్టుకునే వరకు వెళ్లాయి. తోడబుట్టిన అన్నదమ్ములు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండాలి కానీ అలాంటివారు చిన్న చిన్న విషయాలకు నేటి కాలంలో అన్నదమ్ములు విపరీతంగా గొడవలు పడుతున్నారు. బంధాలు, ప్రేమలు, అనుబంధాలకు ఏమాత్రం విలువలు ఇవ్వడం లేదు. తాజాగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్ళింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో జరిగింది.

స్త్రీలు, పురుషులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెద్ద బండరాయితో మొదట మహిళ తలను దారుణంగా పగులగొట్టాడు. స్థానికులు ఎంత ఆపినా కూడా మరో వ్యక్తి తలపైన బాదాడు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కాస్త విషమంగానే ఉందని వైద్యులు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. అయితే దాడికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన మరింత సమాచారం వెలవడనుంది.
Sensitive Content
తల్లి బంగారం కోసం దారుణంగా కొట్టుకున్న అన్నదమ్ములు
అన్న కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన తమ్ముడు
ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో తమ తల్లి బంగారం విషయంలో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్న అన్నదమ్ములు
అన్న నాగిరెడ్డి కుటుంబంపై… pic.twitter.com/ddpGxuoHCp
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2025