TDPలో చేరనున్న ముగ్గురు YCP ఎమ్మెల్సీలు?

-

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు త్వరలోనే అధికారికంగా టీడీపీలో చేరబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ఈ ముగ్గురు టీడీపీలో చేరనున్నార‌ట‌.

There are reports that three MLCs from the YSR Congress Party will soon officially join the TDP
There are reports that three MLCs from the YSR Congress Party will soon officially join the TDP

ఈ ముగ్గురు ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఈ చేరికతో టీడీపీ శక్తి మరింత పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైయస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ నిర్వ‌హించేందుకు ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది. తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ‌ ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news