భారతీయులకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. హెచ్ -1బీ వీసాపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం పెట్టారు. ఇకపై అమెరికా వేదికగా పని చేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్.

ఇక ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో చాలా దేశాలకు నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. భారత్తో పాటు చైనాపై కొత్త హెచ్1బీ వీసా విధానం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక అటు ట్రంప్ గోల్డ్ కార్డు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 10 లక్షల డాలర్లకు ట్రంప్ గోల్డ్ కార్డు లభించనుంది. ట్రంప్ గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమాకూరే అవకాశం ఉంది.