Chandrababu: మాచర్లకు సీఎం చంద్ర‌బాబు.. ఆ ప‌థ‌కానికి శ్రీకారం !

-

నేడు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఉదయం 10:30 గంటలకు మాచర్లకు చేరుకొని స్థానిక చెరువు పరిసర ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఇది ఇలా ఉండ‌గా.. ఏపీలో షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీలలో రోజువారి పనిగంటలు పెంచే సవరణ బిల్లులను అసెంబ్లీ ప్రతిపాదించింది. ప్రస్తుతం రోజుకు ఎనిమిది గంటల పని ఉండగా… దానిని 10 గంటలకు పెంచారు. వారానికి 48 గంటల్లో మార్పు లేదు. ఫ్యాక్టరీలలో బ్రేక్ టైం తో కలిపి 12 గంటలకు మించకూడదని పేర్కొన్నారు. ప్రతి ఆరు గంటలకి తప్పకుండా రెస్ట్ ఇవ్వాలని చెప్పారు. మహిళల నైట్ షిఫ్ట్ రాత్రి 7 గంటల నుంచి 8:30 కు-ఉదయం 6 గంటలకు మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు. సంస్థ వారికి ట్రావెల్ సదుపాయం, సెక్యూరిటీ కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news